ఒక భార్యగా ఇస్లాం మహిళకు ఇచ్చే గౌరవం
ఒక భార్యగా ఇస్లాం మహిళకు ఇచ్చే గౌరవం
ఇస్లాం స్త్రీలకు గౌరవాన్నిచ్చింది అనడానికి నిద ర్శనం ఖుర్‌ఆన్‌లో 176 వాక్యాలు గల ఒక పూర్తి సూరా (అధ్యాయం) స్త్రీల కోసమే అవతరించింది. ఆ సూరా పేరు ‘అన్నిసా- స్త్రీలు’. ఖుర్ ఆన్‌లోని మరో సూరాకు పుణ్యస్త్రీ పేరయిన ‘మర్యం’అని పెట్టబడింది. అలాగే అల్లాహ్ విశ్వాసుల కోసం ఆదర్శంగా తోటి విశ్వాసుల్ని పేర్కొ ంటూ ఇద్దరు స్త్రీలను-ప్రవక్త ఈసా (అ) గారి మాతృమూర్తి హజ్రత్ మర్యమ్ (అ) మరియు నియంత ఫిర్‌ఔన్ సతీమణి హజ్రత్ ఆసియా బిన్త్ ముజాహిమ్ (అ)ల పేర్లను ప్రస్తావించాడు అంటే అల్లాహ్ స్త్రీలకు ఏ స్థాయి గౌరవాన్ని ఇచ్చాడో ఇట్టే అర్థమవుతుంది. "విశ్వాసుల విషయంలో అల్లాహ్ ఫిరౌన్ భార్య గాధను దృష్టాంతంగా పేర్కొంటున్నాడు. ఆమె (దైవాన్ని ప్రార్థిస్తూ) "ప్రభూ! నాకోసం నీ దగ్గర స్వర్గంలో ఒక గృహం నిర్మించు. నన్ను ఫికాన్ బారినుండి, అతని (దుష్ట)కర్మల (కీడు)నుండి కాపాడు, (ఈ) దుర్మార్గపు జాతి నుండి నాకు విముక్తి కలిగించు" అని అన్నది.(ఖుర్ఆన్-66:10-12)
మానవ సమాజపు సూక్ష్మ రూపమే కుటుంబం! ఈ కుటుంబ వ్యవస్థ, అందులోని సభ్యుల మానసిక స్థితి, వారి స్థానాలు సహజంగానూ, ఆరోగ్యవంతంగానూ వుంటేనే సమాజం ఆరోగ్యవంతంగా వుంటుంది. సమాజ నిర్వ హణకు, సమాజ సభ్యుల మధ్య పని విభజన ఎంత అవసరమో… కుటుంబంలోనూ పని విభజన అంతే అవసరం. అప్పుడే ఇటు కుటుంబం, అటు సమాజంలోని కార్యాలు సవ్యంగా, సహజంగా, సుందరంగా, సశాస్త్రీయంగా నెరవేరుతాయి. పని విభజన అనేది కేవలం ఆర్థిక పరమైన పరిభాష కాదు. అది బాధ్యతాయుతమైన సంక్షేమకర పరిభాష కూడా. స్త్రీ,పురుషులిరువురూ వారి వారి శారీరక, మానసిక, ప్రాకృతిక మరియు సహజసిద్ధమైన భిన్నత్వాల మూలంగా వారివారి కార్యక్షేత్రాలు విభిన్నంగా, ప్రత్యేకంగా వుండక తప్పదు. ప్రకృతిని, అందులోని జంతుజాలాలను, వాటి మధ్యనున్న వైవిధ్యాలను పరిశీ లిస్తే… ఈ విషయమే మనకు స్పష్టంగా అర్థమవుతుంది.
దేవుడు మానవులందరినీ ఒకే స్థాయిగా పుట్టించలేదు. శారీరకంగా, మానసికంగా, ఆర్థికంగా అనేక వ్యత్యాసాలు ఉంచాడు. కొందరిని తెల్లవాళ్ళుగా, మరికొందరిని నల్లవాళ్ళుగా, కొందరిని అందగాళ్ళుగా, మరికొందరిని అందవిహీను | లుగా, కొందరిని బలవంతులుగా, మరి కొందరిని బలహీనులుగా, కొందరిని పొడుగు వాళ్ళుగా, మరికొందర్ని పొట్టివాళ్ళుగా, కొందరిని ఎక్కువ తెలివిగలవారిగా, మరి కొందరిని తక్కువ తెలివిగలవారిగా, కొందరిని ధనవంతులుగా, మరికొందరిని పేద వాళ్ళుగా పుట్టించాడు.
నేటి ఆధునిక ప్రపంచంలో స్త్రీ సమానత్వం, సాధికారత పేరుతో స్త్రీ విముక్తి మహిళా వాదం తదితర ఇజాల పేర్లతోనూ మహిళను తన సహజ స్థానం నుండి దిగజార్చే ప్రయ త్నాలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. ఇంటిని వదిలి బయటకు రాకుండా స్త్రీ విముక్తి లేక సాధికారత సాధ్యం కాదని నేటి మహిళా సంఘాల తమ ప్రచార హోరుల ద్వారా మహిళా సమాజాన్ని ఉత్తేజ పరుస్తు న్నాయి. ఈ ప్రచార ప్రభావంలో స్త్రీలు ఇరు క్కోవడం, పురుషులకు కూడా ప్రయోజనకారి గా వుండటంతో వీరు కూడా వంత పాడటం మొదలెట్టారు. ఇంటిలో పిల్లల పోషణ, శిక్షణ, గృహ నిర్వహణతోపాటు ఆమె డబ్బు సంపా దించే యంత్రంగా మార్చడం తనకు అన్ని విధాలా లాభదాయకమని పురుషుడు భావించి స్త్రీ తన సహజమైన స్థానాన్ని వీడిపోయేందుకు సహకరిస్తున్నాడు.నేటి కుటుంబ వ్యవస్థ బీటలువారడానికి ప్రధాన కారణం ఇదే. ఇక ఒక భార్యగా ఇస్లాం మహిళకు ఇచ్చే గౌరవం గురించి తెలుసుకుందాం!
సమానత్వంకాదు, న్యాయం కావాలి.
కొందరు ప్రతిచిన్న విషయానికి ఇస్లాం స్త్రీపురుషుల మధ్య వివక్ష చూపుతోందని, సమానత్వం పాటించడం లేదని విమర్శిస్తారు. కాని వారు స్త్రీ శరీరాకృతికి, పురుష శరీరాకృతికి మధ్య తేడా గమనించడం లేదా? స్త్రీ మానసిక స్థితికి, పురుషుని మానసిక స్థితికి వ్యత్యాసం లేదా? సహజ సిద్ధమైన ఇలాంటి చిన్న చిన్న వ్యత్యాసాలను సయితం వదిలేసి అంతా సమానం అన్నప్పుడే లేనిపోని సమస్యలు వచ్చి సమాజం అశాంతికి గురవుతుంది. మనకు కావలసింది సమానత్వం కాదు. న్యాయం కావాలి. న్యాయంలేని స్త్రీపురుష సమానత్వం ఎందుకండీ?
"సాధారణంగా స్త్రీలపై పురుషులకు ఎలాంటి హక్కులున్నాయో న్యాయపరంగా పురుషులపై స్త్రీలకు కూడా అలాంటి హక్కులే ఉన్నాయి. కాకపోతే పురుషులకు స్త్రీలపై ఒకమెట్టు ఆధిక్యత ఉంది. దేవుడు అసాధారణ శక్తిమంతుడు, అద్భుత వివేచనాపరుడు, (ఖుర్ఆన్-2:228)
సత్పౌ రులు ఎవరు?
ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) “స్త్రీల విషయంలో అల్లాహ్ కు భయపడండి, భార్యలను బాగా చూసుకొనేవాడే మీలో అందరికంటే మంచివాడు, ఒక ముస్లిం తన భార్యను అసహ్యించుకోకూడదు, ఒక విషయంలో ఆమె తప్పు చేసినా ఆమెలోని మంచి విషయాన్ని చూసి ఆమె తప్పులను మన్నించాలి, భార్యతో చాలా మంచిగా ఉండే భర్తయే ఉత్తమ విశ్వాసి” అని అన్నారు. (సహీహ్ అల్ ముస్లిం 3469, తిర్మిజీ 278.)
విశ్వాస పూర్ణతకు ఆనవాలు ఏది?
ఏ మనిషైతే స్త్రీని గౌరవించి, ఆమెతో న్యాయంగా మెలుగుతాడోఅతనే నిజమైన మగాడు మరియు మర్యాదస్తుడు, అదే ఎవడైతే ఆడవారిని అవమానపరుస్తాడో అతడు చాల చెడ్డ వ్యక్తి అని ఇస్లాం బోధిస్తుంది.
“అందరికంటే ఉత్తమమైన వ్యక్తిత్త్వం గలవాడే పూర్ణ విశ్వాసి. మీలో మీ ఇంటివారితో ఉత్తమంగా మేలిగేవాడే అందరికంటే ఉత్తముడు” అని దైవప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లం అన్నారు.(తిర్మిజి1162)
నికాహ్ హక్కు:
ఇస్లాం పరిపూర్ణమవ్వక ముందు ఏ సమాజం లోనూ వివాహం కోసం అమ్మాయి అనుమతి ఆచారం ఉన్నట్లు కనబడదు. ”అవివాహిత వనితలతో వారి వివాహం గురించి అభిప్రా యం కోరాలి” అని, ”కన్నె పిల్లలతో వివాహం కోసం వారి అనుమతి కోరాలి”అని దైవప్రవక్త ముహమ్మద్ (స) వారు నొక్కి వక్కాణించడమే కాక, ‘తన తండ్రి తన అభీష్టానికి వ్యతిరేకంగా వివాహం జరిపించాడు’ అని ఓ అమ్మాయి దావా వేయగా, ప్రవక్త (స) ఆ పెళ్ళిని రద్దు చేయించారు. ”ఇస్లాంలో వివాహానికి ముందు అమ్మా యితో తప్పనిసరి అనుమతి పొందే విధానం నాకు ఎంతో నచ్చింది” అని ఓ సందర్భంలో భారత మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పాయి అభిప్రాయ పడటం గమనార్హం!
భార్య హక్కులు
ఖుర్ఆన్ లో ఇలా సెలవియ్యబడింది: “మరి ఆయన సూచనలలోనే ఒకటేమంటే; ఆయన మీ కోసం స్వయంగా మీలో నుంచే భార్యలను సృజించాడు- మీరు వారి వద్ద ప్రశాంతత పొందటానికి! ఆయన మీ మధ్య ప్రేమనూ, దయాభావాన్నీ పొందుపరచాడు. నిశ్చయంగా ఆలోచించే వారి కోసం ఇందులో ఎన్నో సూచనలున్నాయి.” (ఖుర్ఆన్ సూరా రూమ్ 30:21)
ఇస్లాంలో పెళ్లి కేవలం శారీరికమైన కోరిక తీర్చే సాధనం మాత్రమే కాదు. ఇది అల్లాహ్ తరఫున ఓ సూచన మరియు సంకేతం. ఈ బంధుత్వంలో అల్లాహ్ ఆదేశానుసారం పరస్పర హక్కులు, బాధ్యతలు ఇమిడి ఉన్నాయి. అల్లాహ్ స్త్రీ, పురుషులను ఇచ్చి పుచ్చుకునే ప్రకృతి ధర్మంపై పుట్టించాడు. ఖుర్ఆన్ లో తెలియజేయబడిన చట్టాలను అనుసరించిన మీదట వీరి మధ్య సామరస్యపూర్వకమైన సంబంధం స్థాపితమవుతుంది.
పురుషులను అల్లాహ్ స్త్రీల సంరక్షకులుగా చేశాడు. పురుషులు కుటుంబ బాధ్యతలను కూడా నెరవేర్చాలి. జీవితాన్ని అల్లాహ్ ఆదేశానుసారం గడపండని తన కుటుంబాన్ని ఆదేశించడం కూడా అతని బాధ్యతల్లో ఒక ముఖ్యమైన బాధ్యత. కుటుంబ సభ్యుల పట్ల దయాగుణం కలిగి ఉండడంభార్య బాధ్యతల్లో ఓ ముఖ్యమైన బాధ్యత.
మహర్ (స్త్రీ ధనం): ఇది పెళ్ళి జరిగే సమయంలో లేదా శోభన సమయంలో భర్త నుండి భార్య పొందవలసి ఉన్న ధనం. దీనిని తప్పని సరిగా ప్రతి భర్త తన భార్యకు ఇవ్వవలసి ఉంటుంది. ఖుర్ఆన్ లో ఇలాఉంది: “(పెళ్ళి చేసుకోబోయే) స్త్రీలకు మంచి మనస్సుతో వారి మహర్ ను చెల్లించండి.” (ఖుర్ఆన్, సూరా అన్ నిసా4:4)
పురుషుడు వివాహసందర్భంలో ఏదయినా కారణం వల్ల మహర్ చెల్లించలేకపోతే, వివాహం తరువాత వీలైనంత త్వరగా మహర్ చెల్లించాలి. ఇది భర్త నెరవేర్చవలసిన మొదటి బాధ్యత.
ఖర్చులు - పోషణ:
భార్యను పోషించటమంటే ఆవిడకు సమంజసమైన రీతిలో భోజన సదుపాయాలు మరియు వసతి సౌకర్యాలు కల్పించటం. భార్య ధనవంతురాలైనా సరే ఆ ఖర్చులను భర్త నుండి పొందే పూర్తి హక్కు ఆవిడకు ఉన్నది. ఎందుకంటే ఖుర్ఆన్ ఇలా ఉపదేశిస్తుంది: “కాని బిడ్డ తండ్రి, (ఆ బిడ్డ) తల్లి యొక్క భోజన సదుపాయాల మరియు దుస్తుల ఖర్చులు సమంజసమైన రీతిలో భరించవలసి ఉన్నది.” (ఖుర్ఆన్, సూరా బఖరా 2:233)
విశ్వాసుల మాత హజ్రత్ ఆయేషా (రజియల్లాహు అన్హా) ఉల్లేఖించిన హదీస్ : “అబూ సుఫ్యాన్ భార్య అయిన హింద్ బిన్తె ఉత్బా దైవప్రవక్త (స) వద్దకు వచ్చి, ఇలా విన్నవించుకుంది- , ‘ఓ దైవప్రవక్తా! అబూ సుఫ్యాన్ నా పై మరియు నా పిల్లలపై ఖర్చు పెట్టని పిసినారి మనిషి. ఆయనకు తెలియకుండా ఖర్చుల కోసం నేను ఆయన ధనంలో నుండి కొంత తీసుకుంటూ ఉంటాను. అలా చేయటం వలన నాపై ఏమైనా పాపం ఉంటుందా?’ దానికి జవాబుగా దైవప్రవక్త (స) ఇలా పలికినారు, ‘నీకు మరియు నీ పిల్లలకు సరిపడేటంత ధనం మాత్రమే ఆయన సంపద నుండి తీసుకో, ఇది సమంజసంగా ఉండవలెను (అవసరాలకు మించి తీసుకోకూడదు).’(బుఖారీ, ముస్లిం)
తన అంతిమ హజ్ ప్రసంగంలో దైవప్రవక్త ఇలా అన్నారు: “స్త్రీల విషయంలో అల్లాహ్ కు భయపడండి! అల్లాహ్ యొక్క రక్షణలో మీరు వారిని తీసుకున్నారు. వారితో సంభోగించటం అల్లాహ్ యొక్క సందేశాల ఆధారంగా ధర్మబద్దం చేయబడినది. మీకు కూడా వారిపై హక్కులు ఉన్నాయి, మీరు ఇష్టపడని వారెవ్వరినీ మీ పరుపు పై కూర్చోనివ్వరాదు (అంటే ఇంటిలోనికి అనుమతించ కూడదు) కాని ఒకవేళ వారలా చేస్తే, మీరు వారిని శిక్షించండి, కాని తీవ్రంగా కాదు. మీ పై వారికున్న హక్కులు ఏమిటంటే, వారి భోజన సదుపాయాలు, దుస్తులు సమంజసమైన రీతిలో మీరు సమకూర్చటం.” (ముస్లిం)
“స్థితిమంతుడు తన స్థితికి తగినట్లుగా, పేదవాడు తన స్థోమతకు తగినట్లుగా ధర్మం ప్రకారం ప్రయోజనం చేకూర్చాలి. ఉత్తమంగా వ్యవహరించే వారికి ఇది విధిగా నిర్ణయించబడింది.”(ఖుర్ఆన్, సూరా అల్ బఖరహ్ 2:236)
సరైన వసతి: ఇది కూడా భార్య హక్కులలోని ఒక ముఖ్యమైన హక్కు. భర్త తన స్తోమతను, స్థాయిని బట్టి భార్యకు సరైన వసతి కల్పించవలసి ఉంది. ఖుర్ఆన్ లో అల్లాహ్ ఇలా ప్రకటిస్తున్నాడు: “మీరు నివసించే చోట మీకు అనుకూలమైన విధంగా వారికి వసతి కల్పించండి.” ( ఖుర్ఆన్, సూరా అత్తలాఖ్ 65:6)
భార్యలందరి హక్కులను గౌరవించాలి.
"వారిపట్ల మంచితనం కలిగివుంటూ సంసారం చేయండి. ఒకవేళ వారు మీకు (ఒక విషయంలో) నచ్చకపోతే, నచ్చని విషయంలోనే దేవుడు మీకు ఎంతో శ్రేయస్సు, మేలు పెట్టి ఉండవచ్చు. (ఖుర్ఆన్-4:19)
"భార్యలందరి పట్ల సమానదృష్టితో మసలుకుంటూ వారికి పూర్తిన్యాయం చేకూర్చ డం మీ శక్తికి మించిన పని. మీరు తలచినా అలా చేయలేరు. అయినా మీరు ఒక భార్య వైపు పూర్తిగా మొగ్గి మరొకామెను డోలాయమాన స్థితిలో పడవేయకండి. మీ వైఖరి సరిదిద్దుకొని దేవునికి భయపడుతూ మసలుకోండి. దేవుడు గొప్ప క్షమాశీలి, అమిత దయామయుడు. ఒకవేళ దంపతులిరువురూ విడిపోవడానికే నిర్ణయించుకుంటే దేవుడు| తన అపార శక్తియుక్తులతో వారిని ఒకరిపై మరొకరు ఏమాత్రం ఆధారపడని వారిగా చేయగల్గుతాడు. దేవుడు సర్వోపగతుడు, ఎంతో వివేచనాపరుడు, "(ఖుర్ఆన్-4: 129, 130)
ఇద్దరు లేక అంతకన్నా ఎక్కువమంది భార్యలున్నప్పుడు పురుషుడు వారి మధ్య | అన్నివిధాలా సమానత్వం పాటించలేడు. భార్యల మధ్యఉండే అందం, వయస్సు, స్వభావం, ఆరోగ్యం వగైరా తేడాల కారణంగా అతను వారందర్నీ సమాన దృష్టితో చూడటం, ఒకేవిధంగా ప్రేమించడం సహజంగానే సాధ్యంకాదు. అయితే అంతమాత్రాన ఆకర్షణలేని భార్యను పూర్తిగా విస్మరించి ఆకర్షణగల భార్యవైపు మొగ్గడం భావ్యంకాదు.ఏదేని ఒక వ్యవహారంలో పూర్తిగా సమానత్వం పాటించకపోయినా ఇతర వ్యవహారాల్లో మటుకు సంపూర్ణ సమానత్వం పాటించాలి.
"ఎవరికైనా ఇద్దరు భార్యలుండి, వారిద్దరి హక్కుల్ని న్యాయంగా, సమానంగా, సమంజసంగా నిర్వర్తించకపోతే, తీర్పుదినాన అతను సగం శరీరం కోల్పోతాడు. ఆ స్థితిలోనే (అర్థశరీరంతో సమాధి నుండి) లేస్తాడు" అన్నారు దైవప్రవక్త (స). (తిర్మిజి)
నోటిదురుసు పెళ్ళాంతో ఎలా వేగాలి?
హజ్రత్ లఖిత్ (రజి) కథనం: నేను ఓరోజు దైవప్రవక్త (స) సన్నిధికెళ్ళి నా భార్య నోటిదురుసు గురించి ఆయనకు ఫిర్యాదు చేశాను. దైవప్రవక్త (స) నా ఫిర్యాదు విని "నీవు నీభార్య నోటిదురుసును భరించలేకపోతే ఆమెకు విడాకులివ్వు" అన్నారు.
దానికి నేను "దైవప్రవక్తా! నేను మొదట పిల్లల్ని గురించి ఆలోచిస్తున్నాను. తరువాత ఆమె నాతో ఓ సుదీర్ఘకాలం సంసారం చేసింది. అంచేత ఆమెకు విడాకులివ్వడానికి నాకు మనసొప్పడం లేదు" అని అన్నాను.
అప్పుడు దైవప్రవక్త (సల్లం) ఇలా సలహా ఇచ్చారు: "అయితే ఆమెకు మంచితనంతో, నేర్పుగా హితబోధ చెయ్యి. ఆమె నైజంలో మంచి అనేది ఉంటే నీ మాట విని నీవు చెప్పినట్లు నడుచుకుంటుంది. అయితే (ఒక విషయం గుర్తుంచుకో.) | బానిసను కొట్టినట్లు ఆమెను కొట్టడం ధర్మసమ్మతం కాదు." (అబూదాపూర్)
మహాప్రవక్త ముహమ్మద్ (స) ఇలా బోధించారు: "మీరు స్త్రీల పట్ల మృదువుగా వ్యవహరించండి. స్త్రీలు ప్రక్కటెముకలతో సృజించబడ్డారు. ప్రక్కటెముకలలో కూడా అన్నిటికంటే ఎక్కువ వంకరగా ఉండే పైఎముకతో సృజించబడ్డారు. మీరు దాన్ని సరిచేయడానికి ప్రయత్నిస్తే అది విరిగిపోతుంది. ఒకవేళ దాని మానాన వదిలేస్తే అది అలా వంకరగానే ఉంటుంది. కనుక మీరు స్త్రీలతో మంచిగా (మృదువుగా మసలు కోండి." (బుఖారి, ముస్లిం)
చెడుకి చిరునామాగా మారకూడదు
"అవిశ్వాసుల విషయంలో దేవుడు నూహ్, లూత్ (ప్రవక్తల భార్యల్ని ఉదాహరణ లుగా పేర్కొంటున్నాడు. ఆ స్త్రీలిద్దరు పుణ్యాత్ములైన మా భక్తులిద్దరి దాంపత్యంలో ఉండే వారు. కాని వారు తమభర్తల పట్ల విశ్వాసఘాతుకానికి పాల్పడ్డారు. అంచేత వారా స్త్రీలను దేవుని (శిృక్ష) నుండి ఏమాత్రం కాపాడలేక పోయారు. వారిద్దరితో 'వెళ్ళండి, అగ్నిలో పడేవారితోపాటు మీరూ అగ్నిలోకి పోయి పడండి' అని చెప్పడం జరిగింది.” (ఖుర్ఆన్-66:10)
ఈ స్త్రీలిద్దరూ తమ భర్తల పట్ల విశ్వాసఘాతుకానికి పాల్పడ్డారంటే నీతి బాహ్య మైన చేష్టలకు ఒడిగట్టారని అర్థం కాదు. వారు ధర్మం విషయంలో తమ భర్తలతో సహకరించ లేదు. పైగా దాన్ని తిరస్కరించి సత్య తిరస్కారులతో చేతులు కలిపారు. హజ్రత్ నూహ్ (అలైహి) భార్య దుర్మార్గులు, దౌర్జన్యపరులైన తన జాతి నాయకులకు విశ్వాసుల్ని గురించి ఎప్పటికప్పుడు సమాచారం అందజేస్తుండేది. అలాగే హజ్రత్ లూత్ (అలైహి) భార్య కూడా తనభర్త ఇంటికి వచ్చేవారిని గురించి దుర్మార్గులైన తన జాతి నాయకులకు సమాచారం అందజేస్తుండేది.
స్త్రీలకు అందంతో పాటు ఆత్మసౌందర్యం కూడా ఉంటే అమెను చేసుకునే వాడు ఎంతో అదృష్టవంతుడని చెప్పవచ్చు. ఆత్మసౌందర్యంలేని అందం ఆడదానికి అహంకారం తెచ్చిపెడ్తుంది. అందానికి అహంకారం తోడయితే ఇక ఆ సుందరాంగి ఏ ఒక్కచోటా నాలుగు కాలాలపాటు నిలదొక్కుకోలేదు.
శీలవతే భర్త హృదయాన్ని ఏలుతుంది
నాలుగు వస్తువులు లభించినవారికి ఇహపరలోకాల మేళ్ళు లభించినట్లేనని దైవ ప్రవక్త (సల్లం) తెలిపారు. ఆ నాలుగు వస్తువులు ఇవి::
(1) కృతజ్ఞతతో ఉండే హృదయం.
(2) ఎల్లవేళలా దైవాన్ని స్మరించే నోరు. (3) కష్టాలను సహించే శరీరం.
(4) దైవభీతితో తన మానమర్యాదలు, భర్త ధనసంపత్తి విషయంలో అతని అవిధేయతకు దూరంగా ఉండే ఇల్లాలు.
ఒక మనిషి ఎల్లప్పుడూ దేవుని పట్ల కృతజ్ఞుడై, ఆయన పవిత్రతా ఔన్నత్యాలను స్మరిస్తూ, దైవమార్గంలో ఎదురయ్యే కష్టాలను సహిస్తూ పవిత్రజీవితం గడుపుతున్నా ఉంటే నిస్సందేహంగా ఇది దైవం నుండి అతనికి లభించిన గొప్ప వరమనే చెప్పాలి. | అలాగే దైవం పట్ల భయభక్తులు కలిగివుండటంతో పాటు తనకు విధేయురాలిగా ఉండే భార్య లభించడం కూడా గొప్పవరమే. అందుకే దైవప్రవక్త (స) ఇహపరలోకాల శుభాలు, సౌభాగ్యాల జాబితాలో ఉత్తమ ఇల్లాలిని కూడా చేర్చి భార్యగా, గృహిణిగా స్త్రీ నిర్వహించవలసిన ప్రధాన బాధ్యతల్ని ఈ హదీనులో స్పష్టం చేశారు. నిజానికి శీలవతి అయిన ఇల్లాలే భర్త హృదయాన్ని ఏలగలుగుతుంది.
నోరు మంచిదయితే ఊరు మంచిదవుతుంది.
తన సంసార బృందావనంలో శాంతికుసుమాలు వెల్లివిరియాలంటే భార్య సహనంతో పరిస్థితుల్ని ఎదుర్కోవాలి. ముఖ్యంగా ఆమె తన నోటిని అదుపులో ఉంచు కోవాలి. నోరు పారేసుకోవడాన్ని ఇస్లాం సహించదు. "మీరు నాకు నోటిని గురించి హామీ ఇస్తే, నేను మీకు స్వర్గం గురించి హామీ ఇస్తాన”ని దైవప్రవక్త (సల్లం) అన్నారు. మన తెలుగునాట కూడా "నోరు మంచిదయితే ఊరు మంచిదవుతుంది" అన్న సామెత ఉంది. సాధారణంగా నోటిదురుసు పురుషులకన్నా స్త్రీలలోనే ఎక్కువ.
దైవప్రవక్త (సల్లం) దగ్గర ఆయన అనుచరుడొకాయన ఇద్దరు స్త్రీల ప్రవర్తనను గురించి ప్రస్తావిస్తూ ఇలా అన్నాడు: "దైవప్రవక్తా! ఫలానా స్త్రీ అనేక సఫిల్ నమాజులు (ఐచ్ఛిక ప్రార్థనలు) చేస్తుంది: నఫిల్ ఉపవాసాలు పాటిస్తుంది. దానధర్మాలు కూడా ఎక్కువగానే చేస్తుంది. ఈ సత్కార్యాలలో ఆమె పేరు కూడా సంపాదించింది. అయితే ఆమె తన నోటి ద్వారా తన ఇరుగుపొరుగును బాధిస్తుంది." దైవప్రవక్త (సల్లం) ఈ మాట విని "ఆమె నరకానికి పోతుంది" అని చెప్పారు. ఆ అనుచరుడు తిరిగి మాట్లా దుతూ "దైవప్రవక్తా! ఫలానా స్త్రీ చాలా అరుదుగా నఫిల్ నమాజులు చేస్తుంది. అరుదుగానే నఫిల్ ఉపవాసాలు పాటిస్తుంది. కొన్ని జున్ను ముక్కలు దానం చేస్తుందని కూడా ప్రతీతి. అయితే ఆమె తన నోటి ద్వారా ఇరుగుపొరుగును బాధించదని కూడా (జనం) చెప్పుకుంటారు" అని అన్నాడు. దానికి దైవప్రవక్త (సల్లం) " ఈమె స్వర్గానికి పోతుంది" అని తెలియజేశారు. (మిష్కాత్)
దంపతుల్ని జీవితాంతం గట్టిగా కలిపిఉంచే బంధనాలు పరస్పర సదవగాహన, ప్రేమానురాగాలే. ఇవి రెండు ఆత్మసౌందర్యంలోని భాగాలే. భార్యాభర్తల మధ్య సదవ గాహన లోపించినప్పుడు ప్రేమానురాగాలు క్రమంగా క్షీణిస్తాయి. ప్రేమానురాగాలు క్షీణించినప్పుడు సదవగాహనకు తూట్లు పడతాయి. ఆత్మసౌందర్యం లేనిచోట అనుమాన పెనుభూతం దాంపత్య జీవితానికి పునాదులయిన ఈ రెండు విషయాలు ఒకదానితో మరొకటి అవినాభావ సంబంధం కలిగి ఉన్నాయి. కనుక ప్రశాంత దాంపత్య జీవితం గడపదలచు కున్న మహిళలు ఈ రెండు విషయాలను సొంతం చేసుకోవాలి. ప్రేమలేని భార్యను భర్త చీటికిమాటికి అనుమానించే ప్రమాదం ఉంటుంది. చివరికి ఈ అనుమానం పెనుభూతమయి దంపతుల మధ్య దూరాన్ని పెంచుతుంది.
ఇలాంటి సంసారాలు సాధారణంగా చిన్నచిన్న విభేదాలతో ప్రారంభమై లేనిపోని అనుమానాలతో వేడెక్కి చివరికి రణభూములుగా మారిపోతాయి. దీన్నంతటికీ కారణం నువ్వేనని భర్త నిందిస్తే, ఈదుస్థితికి మీరే బాధ్యులని భార్య ఆరోపిస్తుంది. ఏమైనప్ప టికీ పరిస్థితిని ఉభయులూ సహనంతో, సదవగాహనతో ఎదుర్కోవడానికి ప్రయత్నిం చాలేగాని, ఒకర్నొకరు నిందించుకుంటూ అనుమానాల వాతావరణంలో ఎడ మొగం, పెడమొగంగా ఉండకూడదు. కుటుంబాన్ని చక్కదిద్దుకోవడానికి ముస్లింలకు ఖుర్ఆన్,హదీసుల రూపంలో నిర్దిష్ట ప్రమాణాలు, చక్కని మార్గదర్శక సూత్రాలు ఉన్నాయి. ఆచరణపరంగా వారి ముందు దైవప్రవక్త (సల్లం), ఆయన అనుచరుల ఆదర్శాలు ఉన్నాయి. వాటిని ఆచరిస్తే వారి గృహం స్వర్గధామమే అవుతుంది.

Comments
Post a Comment